Tuesday, December 3, 2024

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని పోతారంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆడ పిల్లలతో సహా తల్లి, బావ మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతారం గ్రామానికి చెందిన మన్నె ఆంజనేయులు, తమ్ముని భార్య లావణ్య, ఇద్దరు పిల్లలు సహస్ర, శాన్వి పని నిమిత్తం బైక్ పై శభాష్ పల్లి వైపు వెళ్తుండగా… గ్రామ శివారులోని రోడ్డుపై ధాన్యం కుప్పలు ఉండడంతో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్, బైక్ వేగంగా ఢీకొనడంతో నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News