- Advertisement -
యాంగూన్ : మయన్మార్లో ప్రజాందోళనలపై భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. కాల్పులను కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఈ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యాంగూన్ లోని హ్లాయింగ్ థార్ యార్ టౌన్షిప్లో తలకు తూటా తగిలి ఒకరు, పొత్తి కడుపులో తూటా దూసుకుపోవడంతో మరొకరు నేలకొరిగారు. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమౌతున్న ఈ దృశ్యాలను చూస్తే గుంపులుగా జనం కొందరు గట్టి టోపీలు , గ్లాస్ మాస్క్లు పెట్టుకుని తుపాకీ కాల్పుల శబ్దాల మధ్య వీధిలో పరుగెత్తుతుండడం కనిపించింది. తూటాలకు, రబ్బరు బులెట్లకు కొందరు గాయపడ్డారు. రోడ్లను నిర్బంధిస్తూ భద్రతా దళాలు మంటబెట్టడంతో దట్టమైన నల్లని పొగ కమ్ముకుంటోంది.
- Advertisement -