Wednesday, November 6, 2024

కారు ప్రమాదంలో ఒకే కుటుంబసభ్యులు నలుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Four killed in road accident

దీపావళి షాపింగ్ నుంచి వస్తుండగా కామారెడ్డి జిల్లా ఎర్రాపహాడ్ మండలకేంద్రంలో దుర్ఘటన
మృతుల్లో ఇద్దరు ఎల్లారెడ్డి, ఇద్దరు పిట్లం వాసులు
ఇద్దరికి తీవ్రగాయాలు
దీపావళికి వచ్చిన అల్లుడుతో కలిసి కామారెడ్డికి వెళ్లి షాపింగ్ చేసుకొని వస్తుండగా మర్రిచెట్టును ఢీకొన్న డిజైర్ కారు

మన తెలంగాణ/ ఎల్లారెడ్డి/ పిట్లం: దీపావళి వెలుగుల్లో పండుగ చేసుకోవాలనుకున్న ఆ కుంటంబం చిన్నాభిన్నమైంది. ఆ కుటుంబంలో వెలుగులకు బదులు చీకట్లు అలుముకున్నాయి. ఎర్రాపహాడ్ మండల కేంద్రం శివారులో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు ఎల్లారెడ్డి వాసులు కాగా, ఇద్దరు పిట్లం మండల కేంద్రానికి చెందిన వారున్నారు. బుధవారం మధ్యాహ్నం ఎర్రాపహాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన వీరవేట శ్రీనివాస్ (52), వీరవేట జగన్ (45), పిట్ల మండల కేంద్రానికి చెందిన నాజోజు ఆనంద్‌కుమార్ (31), నాజోజు సుశాంక్ (04)లు ప్రమాదంలో మృతి చెందగా యశ్వంత్ (3), శ్రీహర్ష (3), మందహాస్ (35)లు తీవ్రంగా గాయపడ్డారుత. మృతుడు శ్రీనివాస్ దీపావళి పండుగ కొరకు పిట్లంలో ఉండే తన కుమార్తె, అల్లుడు ఆనంద్‌కుమార్‌ను ఆహ్వానించారు.

ఎల్లారెడ్డికి కుటుంబంలో వచ్చిన అల్లుడు దీపావళి పండుగకు కొత్తబట్టలు, టపాసులు, పూలు, పండ్లు కొనుగోలు కోసం ఉదయం కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన స్వంత కారు షిఫ్ట్ డిజైర్‌లో ఆనంద్‌కుమార్ తన మామ శ్రీనివాస్, ఆయన తమ్ముడు జగన్, మరో తమ్ముడు మందహాస్, బావమరిది అమర్‌కాంత్, కుమారుడు సుశాంక్, కుటుంబ సభ్యులు యశ్వంత్, శ్రీహర్షలతో కలిసి కామారెడ్డికి వెళ్ళారు. కొనుగోళ్లు ముగించుకొని ఎల్లారెడ్డికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆనంద్‌కుమార్ కారు నడుపుతుండగా తాడ్వాయి దాటగానే వర్షపు చినుకులు మొదలయ్యాయి. ఎర్రాపహాడ్ దాటగా నేరుగా ఉన్న రహదారిలో అటుఇటుగా ఏపుగా పెరిగిన మర్రిచెట్ల వద్దకు కారు చేరుకోగానే అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. మర్రిచెట్ల పై ఉన్న పక్షులు దెబ్బలు వేయడం వల్ల వర్షపు చినుకులకు రోడ్డు జిగటగా మారింది. అందులో నుంచి కారు వెళ్ళగా అదుపుతప్పి మర్రిచెట్టును బలంగా ఢీకొట్టినట్లు తెలుస్తుంది.

ఈ ప్రమాదంలో ముందు సీట్లో ఉన్న జగన్ అక్కడిక్కడే మృతి చెందగా, డ్రైవింగ్ చేస్తున్న ఆనంద్ కుమార్ బలమైన గాయాలతో కొన ఊపిరితో ఉన్నాడు. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్, అతని మనుషుడు నాలుగేళ్ళ చిన్నారి సుశాంక్‌కు తీవ్ర గాయాలైయ్యాయి. మిగతావారికి సైతం బలమైన గాయాలు కాగా రోడ్డు పై వెళ్తన్న వారు ప్రమాదాన్ని గమనించి 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న ఆనంద్‌కుమార్‌ను రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా తుదిశ్వాస పదిలాడు. తీవ్ర గాయాలతో ప్రాణాపా౩య స్థితిలో ఉన్న శ్రీనివాస్, సుశాంక్‌లను మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్‌లో తరలిస్తుండగా శ్రీనివాస్ మార్గమధ్యంలో మృతి చెందగా, చిన్నారి సుశాంక్ కామారెడ్డి వైద్యశాలలో చేర్పించిన కొద్ది సేపటికి మృతి చెందాడు. మృతుడు శ్రీ౪నివాస్ కుమారుడైన అమర్‌కాంత్‌కు రెండు కాళ్ళు విరగగా తమ్ముడు మందహాస్, మిగతా ఇద్దరికి గాయాలైయ్యాయి. మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో విషయం తెలిసిన కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్ళారు. మృతులను చూసి కన్నీరుమున్నీరుగా విలపించడం పలువురిని కలిచివేసింది.

ఒకే కుటుంబానికి చెందిన వారిలో నలుగురు మృతి చెందడంతో ఎల్లారెడ్డి, పిట్లంలో విశాదచ్ఛాయలు అలుముకున్నాయి. ఐదేళ్ళ క్రితం శ్రీనివాస్ తన కూతురిని పిట్లంకు చెందిన నారోజు ఆనంద్‌కుమార్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అల్లుడు, మనుమడు మృతి చెందడంతో శ్రీనివాస్ భార్య, కూతురు బాధలు వర్ణణాతీతంగా మారాయి. భర్తను, కుమారున్ని కోల్పోడంతో ఆమె సొమ్మల్లి పడిపోయింది. ఎల్లారెడ్డి, పిట్లంకు చెందిన పలువురు స్వర్ణకారులు, బంగారు ఆభరణాల వ్యాపారులు సంఘటనా స్థలానికి తరలివెళ్ళారు. కాగా ఎల్లారెడ్డి పట్టణంలో స్వర్ణకార వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News