Thursday, November 21, 2024

రహదారులు రక్తసిక్తం

- Advertisement -
- Advertisement -

రహదారులు రక్తసిక్తమయ్యాయి. రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాద ఘటనలలో నలుగు రు మృత్యువాత పడగా, ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలోకి వెళితే.. జగిత్యాల సమీపంలో కరీంనగర్ – జగిత్యాల రహదారి ధరూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు కారును ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న జగిత్యాల పట్టణానికి చెందిన సంకీర్త్ అనే యువకుడు, అతని పక్కనే ఉన్న మరో యువతి దుర్మరణం చెందారు. సంకీర్త్ ఆయన తల్లిదండ్రులతో కలిసి జనగామలో జరిగిన పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కారు వెనుక సీటులో కూర్చున్న రాయమల్లు ఆయన భార్య తీవ్రంగా గాయ పడ్డారు. ప్రమాదానికి గురైన బస్ టైర్ విడిపోగా కారు బస్సును ఢీకొట్టి చెట్టును ఢీకొట్టడంతో కారు నుజునుజ్జు అయ్యింది.

శ్రీశైలం డ్యామ్ సందర్శనకు వెళ్తూ మృత్యు ఒడిలోకి…
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గ్రీన్ ఫార్మాసిటీ పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ముచ్చర్ల గేట్ వద్ద కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మెహదీపట్నంలోని ఓ ట్రావెల్స్‌లో కారు అద్దెకు తీసుకుని శ్రీశైలం డ్యామ్ సందర్శనకు వెళ్తుండగా మార్గమధ్యలో ముచ్చర్ల గేట్ దగ్గర కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. కారులో ఇంతియాజ్‌ఖాన్(18), నాయబ్(18)లు దుర్మరణం పాలవ్వగా, మరో ఐదుగురికి గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News