Wednesday, January 22, 2025

కెనడా ప్రమాదంలో నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

కెనడాలో తప్పుడు మార్గంలో వాహనం నడుపుతున్న ఒక లిక్కర్ స్టోర్ దోపిడీ నిందితుని ఒంటారియో పోలీసులు వెంటాడిన క్రమంలో పలు వాహనాలు ఢీకొనగా నలుగురు వ్యక్తులు మరణించారు. వారిలో కెనడాను సందర్శిస్తున్న భారతీయ దంపతులు, వారి మూడు నెలల మనవడు కూడా ఉన్నారు. టోరంటోకు తూర్పుగా దాదాపు 50 కిలో మీటర్ల దూరంలోని విట్బీలో హైవే 401పై ప్రమాద స్థలంలోనే ఆ నలుగురూ మరణించినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు 60 ఏళ్ల పురుషుడు, 55 ఏళ్ల మహిళ భారత్ నుంచి వచ్చినట్లు ఒంటారియో ప్రత్యేక దర్యాప్తు విభాగం (ఎస్‌ఐయు) తెలియజేసింది. అయితే, మృతుల పేర్లను ఎస్‌ఐయు వెల్లడించలేదు.

పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఆ దంపతుల మూడు నెలల మనవడు కూడా మరణించినట్లు, ప్రమాదం అనంతరం పలు గంటల పాటు హైవే 401ని మూసివేసినట్లు ఎస్‌ఐయు తెలిపింది. శిశువు తల్లిదండ్రులు 33 ఏళ్ల తండ్రి, 27 ఏళ్ల తల్లి కూడా అదే వాహనంలో ప్రయాణిస్తున్నట్లు, వారిని ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐయు తెలియజేసింది. తల్లికి తగిలిన గాయాలు తీవ్రమైనవనిఆ విభాగం తెలిపింది. 21 ఏళ్ల దోపిడీ అనుమానితుడు కూడా ఆ ప్రమాదంలో మరణించాడని, కనీసం ఆరు వాహనాలు ఢీకొన్నాయని ఒక వార్తా సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News