Wednesday, January 22, 2025

కరీంనగర్‌లో కారు బీభత్సం.. నలుగురి దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Four killed in road accident in Karimnagar

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రిలో ముగ్గురు ప్రాణాలు వదిలారు. కరీంనగర్ కమాన్ వద్ద అదుపుతప్పిన కారు రహదారి పక్కన ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. దీంతో గుడిసెల్లో నిద్రిస్తున్న నలుగురు మృతి చెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ సర్కార్ దహఖానకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. సమచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతిచెందిన వారిని ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ఘటన అనంతరం నలుగురు యువకులు కారును వదిలేసి పరారయ్యారు. కారుపై 9 ఓవర్ స్వీడ్ చలాన్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

Four killed in road accident in Karimnagar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News