Monday, December 23, 2024

మధురలో రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మధుర (యుపి ) : ఉత్తరప్రదేశ్ లోని అనాజ్ మండీలో మంగళవారం రాత్రి ట్రక్కును టెంపో ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. యుమ్రాయ గ్రామంలో పెళ్లికి హాజరైన కుటుంబం టెంపోలో తిరిగి వస్తుండగా మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు డల్బీర్ సింగ్ (35). ధ్రువ్ (16).చున్నీలాల్ (55), శ్యామ్ ( 40) గా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు పంపినట్టు పోలీస్‌లు చెప్పారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News