Saturday, December 21, 2024

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…

- Advertisement -
- Advertisement -

Four killed in road accident krishna district

అమరావతి: కృష్ణా జిల్లా అవనిగడ్డలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. మోపిదేవి మండలంలో బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెళ్లికి వెళ్లి వస్తుండగా వాహనం ప్రమాదానికి గురైంది. మృతులు కోన వెంకటేశ్, కోటేశ్వరమ్మ, గుర్రేపల్లి రమణ,గుర్రం విజయ్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో 20 మంది ఉన్నారు. వీరందరూ ఘంటసాల మండలం చింతమడక గ్రామానికి చెందినవారు. అవనిగడ్డ ఎంఎల్ఏ గాయపడిన వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News