Saturday, December 28, 2024

నిజామాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ : నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం నిజామాబాద్ నుంచి బోధన్ మండలం ఊట్‌పల్లికి డ్రైవర్‌తో సహా తొమ్మిది మందితో వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన బోలేరో పికప్ (డిసియం) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు స్వల్ప గాయాలతో క్షేమంగా బయట పడ్డారు. ఈ రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ ప్రశాంత్, చరణ్ నాయక్, డివి. శ్యాం స్పాట్‌లో చనిపోగా రేఖ అనే మహిళను ఆస్పత్రికి తరలించగా మృతి చెందింది.

శేఖర్, కృష్ణ, ఆర్.కృష్ణలకు గాయాలయ్యాయి. ఈ రోడ్డు ప్రమాద సంఘటన జరిగిన ప్రాంతంలో అతివేగంతో రెండు వాహనాలు ఢీకొట్టగా డెడ్‌బాడీలతో అక్కడి పరిస్థితి భయనకరంగా మారింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్ నగరంలో కొత్తగా ప్రభుత్వం నిర్మిస్తున్న ఐట్ హబ్ పనుల్లో కూలీ పని చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. చనిపోయిన, ప్రమాదానికి కారణమైన వాహనంలో ఉన్న వారికి పెద్దగా గాయాలు కాలేవని తెలుస్తోంది. సంఘటన స్థలానికి ఎసిపి కిరణ్‌కుమార్, ఆరవ టౌన్ పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన వారిలో రూరల్ నార్త్ సిఐ నరహరి, ఎస్సై సాయికుమార్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News