Wednesday, January 22, 2025

వైద్య భవనంలో కాల్పులు: నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Four killed in shooting at medical building

ఓక్లహామా(అమెరికా): ఓక్లహామాలోని టుల్సాలో ఒక ఆసుపత్రి క్యాంపస్‌లోని వైద్య భవనం వద్ద బుధవారం ఒక సాయుధుడు జరిపిన కాల్పులలో నలుగురు వ్యక్తులు మరణించారు. అమెరికాలో ఇటీవల కాలంలో వరుసగా ఇటువంటి సంఘటనలు జరగడం కలకలం సృష్టిస్తోంది. ఒక చేతిలో రైఫిల్, మరో చేతిలో గన్ పట్టుకున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు టుల్సా పోలీసు శాఖ డిప్యుటీ చేఫ్ ఎరిక్ డాల్గ్‌లీష్ తెలిపారు. అయితే..కాల్పులు జరిపిన వ్యక్తి కూడా తనను తాను కాల్చుకుని మరణించినట్లు ఆయన చెప్పారు. ఈ కాల్పులకు కారణమేంటో ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News