- Advertisement -
గిరిదిహ్: ఇంట్లో పేలుడు సంభవించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద సంఘటన జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో చోటుచేసుకుంది. గిరిదిహ్ జిల్లా తిస్రీ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని గిరిదిహ్ ఎస్పీ అమిత్ రేణు వెల్లడించారు. ఘటన జరిగిన తీరును బట్టి చూస్తుంటే ఇంట్లో సిలిండర్ పేలి ఉంటుందని అమిత్ రేణు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -