Monday, December 23, 2024

ఉగ్రదాడిలో నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలీసులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడిన ఘటన పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. వివరాలలోకి వెళితే.. బలూచిస్తాన్‌ రాజధాని క్వెట్టాలోని షహ్రా ఈ ఇక్బాల్‌ ప్రాంతంలో ఉనన ఖంధారి బజార్‌లో ఆగివున్న పోలీసు వాహనం వద్ద భారీ పేలుడు సంభవించింది.

పోలీసు వాహనం సమీపంలో ఉంచిన బైక్ లో బాంబు పెట్టి దాన్ని రిమోట్‌ ద్వారా ఆపరేట్‌ చేశారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంపై బలూచిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News