Sunday, December 22, 2024

పొగ మంచులో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ముజఫర్‌నగర్ : ఉత్తర ప్రదేశ్‌లో దట్టమైన పొగమంచు వల్ల సంభవించిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో కనీసం నలుగురు వ్యక్తులు మరణించినట్లు, ఆరుగురు గాయపడినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. దట్టమైన పొగమంచు వల్ల పేలవమైన దృశ్యనీయత కారణంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం అయోధ్యకు ప్రయాణాన్ని రద్దు చేసుకోవలసి వచ్చినట్లు పిఎం ఆఫీస్‌లోని ప్రెస్ కార్యదర్శి మృత్యుంజయ్ కుమార్ వెల్లడించారు. కొత్త విమానాశ్రయం, కొత్త రైల్వే భవనం ప్రారంభోత్సవం నిమిత్తం యోగి ఆదిత్యనాథ్

ఈ నెల ౩౦న ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ముందే ఆయోధ్యను సందర్శించవలసి ఉంది. ఆయన ఒకటి రెండు రోజుల్లో రోడ్డు మార్గం ద్వారా అయోధ్యకు వెళ్లవచ్చునని అధికార వర్గాలు సూచించాయి. ఉత్తర ప్రదేశ్‌లో గురువారం తెల్లవారు జామున దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉందని, పర్యవసానంగాద కొన్ని ప్రాంతాలలో దృశ్యమానం 40 మీటర్ల కన్నా తక్కువ దూరానికి దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉందని, దీనితో ఆవలి దృశ్యాలు దృగ్గోచరం కాలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News