Thursday, November 21, 2024

నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్టు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : నిషేధిత మావోయిస్టులకు డబ్బులు, ఇతర వస్తువులు తరలిస్తున్న మావోయిస్టులకు కొరియర్లుగా పని చేస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకొని అరెస్టు చేసిన పోలీసులు గురువారం మీడియా ముందు హాజరు పరిచారు. భూపాలపల్లి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా సూపరిండెంట్ ఆఫ పోలీస్ జె. సురేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం కాటారం పోలీసులు మహాదేవపూర్ రోడ్ ఫారెస్టు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన WB 94 P4855 నంబరు గల స్కార్పియో వాహనం కనిపించగా ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో నలుగురు వ్యక్తులు భారీ మొత్తంలో డబ్బులు, ఇతర వస్తువులు కనిపించాయి. రూ. 76 లక్షల 5700లు, సామ్‌సాంగ్ ట్యాబ్, క్యాసియో వాచీలు, ముందులు, సిరఫ్ సీసాలు, నూట్యీషన్ పౌడర్, జెలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లు, కార్డెక్స్ వైర్, వైట్ టవల్స్ ఉండగా వాహనంతో పాటు వారిని అదుపులోకి తీసుకొని కాటారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Also Read: రేపే పెళ్లి.. పెళ్లి ఇంట్లో పెను విషాదం

కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి సమక్షంలో ఇద్దరు పంచ్‌లు, పోలీసులు వారిని విచారించి మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు పోలీసులు వివరాలు సేకరించారు. నిషేధిత మావోయిస్టులు కొరియర్లుగా పని చేస్తున్న కరీంనగర్‌కు చెందిన అబ్దుల్ ఈజీజ్ ఏ1, హుజూరాబాద్‌కు చెందిన మహహ్మద్ అబ్దుల్ రజాక్ ఏ2గా, చతీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా భూపాలపట్నం చందూరుకు చెందిన జనగామ రాఘవ్ ఏ3గా, వెస్ట్ బెంగాల్‌కు చెందిన కౌసర్ అలీ ఏ4గా వీరితో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరితో పాటు మరి కొందరు కొరియర్లు ఛతీస్‌ఘడ్‌కు చెందిన ఆత్రం నారాయణ అనే వ్యక్తి ద్వారా వర్గీస్,భాస్కర్, దిలీప్ ఉంగ, వెళ్లాల్ అనే నిషేధిత మావోయిస్టులు పరిచయమైనట్లు వారు తెలిపారు. గత తొమ్మిది సంవత్సరాల నుండి మావోయిస్టులను కలస్తున్నట్లు, వారికి అవసరమయ్యే వస్తువులు, డబ్బులు ఆత్రం నారాయణ ద్వారా చేరవేస్తున్నట్లు వారు తెలిపారు. ఆత్రం నారాయణ, మారుపాక రామయ్య సహాయంతో డబ్బులతో పాటు విలువైన వస్తువులు సమకూర్చుకుని అజీజ్ కరీంనగర్‌లో ఇంటి వద్ద పెట్టుకున్నాడు.

బుధవారం అజీజ్ తన కుమారుడుతో పాటు అతని స్నేహితలతో కలిసి కొయ్యూరు కాటారం మధ్యలో వారి నుండి వాటిని తీసుకొని మహాదేవపూర్ మీదుగా ఛతీస్‌ఘడ్ వెళ్తున్న సమయంలో కాటారంలో పోలీసులకు చిక్కినట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో సరమర్ధవంతంగా పని చేసి ఓఎస్‌డి అశోక్‌కుమార్, కాటారం డీఎస్సీ జి.రామ్మోహన్‌రెడ్డి, కాటారం సిఐ రంజిత్‌రావు, కాటారం, అడవిముత్తారం, మహాదేవపూర్, కొయ్యూరు, కాళేశ్వరం ఎస్సైలు శ్రీనివాస్, సుధాకర్, రాజ్‌కుమార్, లక్ష్మణ్‌రావు, నరేష్‌లను జిల్లా ఎస్పీ జె. సురేందర్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సిఐ రంజిత్‌రావు, కాటారం ఎస్సై శ్రీనివాస్, అడవిముత్తారం ఎస్సై సుధాకర్, కొయ్యూరు ఎస్సై నరేష్, మహాదేవపూర్ ఎస్సై రాజ్‌కుమార్, కాళేశ్వరం ఎస్సై లక్ష్మణ్‌రావు ఉన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News