Sunday, December 22, 2024

నలుగురు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

భద్రాచలం: నలుగురు మావోయిస్టు పార్టీ కొరియర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పేలుడు పదార్థ్ధాలతో పాటు రూ.20లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా. వినీత్ తెలిపారు. శనివారం భద్రాచలం ఎఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. దుమ్ముగూడెం ఎస్‌ఐ కేశవరావు, సీఆర్పీపిఎఫ్ సంయుక్తంగా తనఖీలు నిర్వహిస్తుండగా పైడిగూడెం నుంచి నల్లబెల్లి సెంటర్‌వైపు వెళుతున్న కారు పోలీసులు ఆపినా ఆగకుండా వెళ్లడంతో వెంబడించి కారులో ఉన్న వక్తులను విచారించగా వారు మావోయిస్టు కొరియర్లుగా తేలిందని చెప్పారు.

వీరంతా నిషేధిత మావోయిస్టు పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తున్నారని పోలీసులపై దాడి చేసేందుకు అవసరమైన పేలుడు పదార్థాల కోసం రూ. 20లక్షలు మావోయిస్టుల వద్ద నుంచి తీసుకొని, శాంపిల్స్‌గా జిలెటిన్ స్టిక్స్, కార్డెక్స్‌వైర్, డిటోనేటర్లు, తుటాలు తరలిస్తుండగా పట్టుబడ్డారని వెల్లడించారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా సహకరిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఒఎస్‌డి టి.సాయిమనోహర్, భద్రాచలం ఎఎస్పీ పారితోష్‌పంకజ్, దుమ్ముగూడెం సిఐ రమేష్, ఎస్‌ఐ కేశవ్, సీఆర్పీఎఫ్ అడిషనల్ కమాండెంట్ ప్రీతా, ఆర్‌కె చౌరాసియాలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News