Monday, December 23, 2024

నలుగురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వాజేడు: మావోయిస్టులకు సహకరిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వాజేడు, వెంకటాపురం మండలాల సిఐ బండారు కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు కార్యకలాపాలు తెలంగాణ, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దులో ఉధృతం అవుతున్న నేపథ్యంలో వాటిని అణిచివేసేందుకు నిత్యం ములుగు జిల్లా పోలీసులు గురువారం పక్కా సమాచారంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు సిఐ బండారు కుమార్, వాజేడు ఎస్సై చావళ్ళ వెంకటేశ్వరావు, 39 బెటాలియన్ సిఆర్‌పిఎఫ్ క్యాంప్ టీం 1 కలిసి మండలంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏటూరునాగారం నుండి ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు కడారి యాదగిరి, కలకోట ప్రభాకర్, శివరాత్రి పవన్ కళ్యాణ్, ఎల్మకంటి మహేష్ (తీగారం గ్రామం, జాఫర్‌ఘడ్ మండలం, జనగాం జిల్లా)లు పోలీసులను చూసి ద్విచక్ర వాహనాలను వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

పట్టుబడిన వ్యక్తుల వద్ద ఉన్న సంచులను తనిఖీ చేయగా అందులో పేలుడు పదార్థ్ధాలైన జిలెటిన్ స్టిక్స్, ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన విప్లవ సాహిత్య పుస్తకాలు కనిపించడంతో అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. కడారి యాదగిరి, కలకోట ప్రభాకర్ గత 20, 25 సంవత్సారాల క్రితం పీపుల్స్ వార్ గ్రూప్ దళ సభ్యులుగా పనిస్తున్న క్రమంలో పోలీసులు అరెస్టు చేసినట్లు జైలుకు వెళ్ళి వచ్చి గత కొంత కాలంగా ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులైన బడే చిక్కరావు అలియాస్ దామోదర్‌కు కొరియర్‌లుగా పని చేస్తున్నారని ఈ క్రమంలో వీరు ఇద్దరు కలిసి దామోదర్, మరికొంత మంది దళ సభ్యుల ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీలో చేరడానికి ఆసక్తి గల కొత్త వ్యక్తులు శివరాత్రి పవన్ కళ్యాణ్, ఎల్మకంటి మహేష్ లకు మాయ మాటలు చెప్పి మావోయిస్టు భావ జలాలను వివరించి వారిని ప్రేరేపించి పార్టీలో చేర్పించడానికి తీసుకుని వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ వారికి సహకరించవద్దని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News