Sunday, December 22, 2024

నలుగురు ఎంబిబిఎస్ విద్యార్థుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి ప్రశ్నాపత్రం లీకేజీ కేసుకు సంబంధించి ఎయిమ్స్ పాట్నాకు చెందిన నలుగురు ఎంబిబిఎస్ విద్యార్థులను సిబిఐ గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం ఎయిమ్స్ పాట్నాలో ఎంబిబిఎస్ మూడవ సంవత్సరం చదువుతున్న చందన్ సింగ్, రాహుల్ అనంత్, కుమార్ షాను, రెండవ సంవత్సరం చదువుతున్న కరణ్ జైన్‌ను సిబిఐ అధికారులు అరెస్టు చేశారని వారు చెప్పారు. సీనియర్ ఫ్యాకల్టీ సభ్యుల సమక్షంలో ఈ నలుగురు విద్యార్థులను వారి హాస్టల్ గదుల నుంచి వెలుపలకు తరలించి వారిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వారి హాస్టల్ గదులను సిబిఐ సీల్ చేసినట్లు అధికారులు తెలిపారు.

నలుగురు ఎంబిబిఎస్ విద్యార్థులను సిబిఐ తీసుకువెళ్లినట్లు ఎయిమ్స్ పాట్నా డైరెక్టర్ జికె పాల్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా నలుగురు వ్యిర్థులను ప్రశ్నించాల్సి ఉందని సిబిఐ నుంచి ఆ విద్యార్థుల ఫోటోలు, సెల్‌ఫోన్ నంబర్లు తనకు ఫోన్ ద్వారా అందినట్లు ఆయన చెప్పారు. కాగా..నీట్ యుజి ప్రశ్నాపత్రాన్ని హజారీబాగ్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ)కి చెందిన ట్రంకు నుంచి చోరీ చేశాడన్న ఆరోపణపై ఎన్‌ఐటి జంషెడ్‌పూర్‌కు చెందిన 2017 బ్యాచ్ సివిల్ ఇంజనీర్ పంకజ్ కుమార్ అలియాస్ ఆదిత్యను సిబిఐ అధికారులు అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత తాజా అరెస్టులు జరగడం గమనార్హం. బొకారో నివాసి అయిన కుమార్‌ను సిబిఐ అధికారులు పాట్నాలో అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రాన్ని చోరీ చేయడంలో కుమార్‌కు సాయపడ్డాడన్న ఆరోపణపై రాజు సింగ్ అనే వ్యక్తిని కూడా హజారీబాగ్‌లో సిబిఐ అరెస్టు చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News