Monday, January 27, 2025

టాప్ 10లో నాలుగు సంస్థల ఎంక్యాప్ రూ. 1.25 లక్షల కోట్లు హాంఫట్

- Advertisement -
- Advertisement -

రిలయన్స్‌కు భారీ నష్టం
ముంబయి : దలాల్ స్ట్రీట్‌లో మదుపరులల్లో బలహీన సెంటిమెంట్ల నేపథ్యంలో క్రితం వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో టాప్ 10 సంస్థల్లో నాలుగు సంస్థలు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ. 125397.45 కోట్లు కోల్పోయాయి. వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోయింది. క్రితం వారం బిఎస్‌ఇ ఇండెక్స్ సెన్సెక్స్ 428.87 పాయింట్లు (0.55 శాతం), ఎన్‌ఎస్‌ఇ సూచీ నిఫ్టీ 111 పాయింట్లు (0.47 శాతం) నష్టపోయాయి. మార్కెట్‌లో సానుకూల పరిస్థితులు నెలకొన్నా ఈక్విటీ మార్కెట్లు పుంజుకోలేకపోయాయి. ఫలితంగా వరుసగా మూడవ వారం ఎన్‌ఎస్‌ఇ సూచీ నిఫ్టీ నష్టాలతో ముగిసిందని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 74969.35 కోట్లు నష్టపోయి రూ. 1685998.34 కోట్లకు చేరుకున్నది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) ఎంక్యాప్ రూ. 21251.99 కోట్ల పతనంతో రూ.9472.06 కోట్ల వద్ద స్థిరపడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ) ఎంక్యాప్ రూ. 17626.13 కోట్లు కోల్పోయి రూ. 664304.09 కోట్ల వద్ద నిలిచింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఎంక్యాప్ రూ. 11549.98 కోట్ల నష్టంతో రూ. 853945.19 కోట్లకు పరిమితమైంది. మరొక వైపు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 24934.38 కోట్ల వృద్ధితో రూ. 778612.76 కోట్లకు చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంక్యాప్ రూ. 9828.08 కోట్లు పుంజుకుని వృద్ధితో రూ. 1261627.89 కోట్ల వద్ద స్థిరపడింది.

భారతీ ఎయిర్‌టెల్ ఎంక్యాప్ రూ. 9398.89 కోట్ల వృద్ధితో రూ. 936413.86 కోట్ల వద్ద నిలిచింది. టిసిఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9262.3 కోట్లు పెరిగి రూ. 1501976.67 కోట్ల వద్ద ముగిసింది. హెచ్‌యుఎల్ ఎంక్యాప్ రూ. 3442.15 కోట్లు వృద్ధి చెంది రూ. 556594.67 కోట్లకు చేరుకుంది. ఐటిసి ఎంక్యాప్ రూ. 1689.08 కోట్ల లబ్ధితో రూ. 552392.01 కోట్ల వద్ద ముగిసింది. క్రితం వారం ట్రేడింగ్ ముగిసిన తరువాత బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల్లో టాప్ సంస్థగా రిలయన్స్ కొనసాగుతోంది. తదుపరి స్థానాల్లో టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, హెచ్‌యుఎల్, ఐటిసి, ఎల్‌ఐసి నిలిచాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News