Thursday, January 23, 2025

ఆ నలుగురికీ మంత్రి పదవులు ఖాయం?

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. రేవంత్ కోసం కామారెడ్డి సీటును త్యాగం చేసిన షబ్బీర్ అలీకి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అంటున్నారు. షబ్బీర్ నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. అలాగే ముషీరాబాద్ నుంచి బరిలోకి దిగి పరాజయం పాలైన అంజన్ కుమార్ యాదవ్ పేరు కూడా ప్రముఖంగా వినబడుతోంది. ఈ ఇద్దరికీ మంత్రిపదవులిచ్చి, ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని తెలుస్తోంది. షబ్బీర్ కు హోం శాఖ కేటాయించే అవకాశం లేకపోలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్యమంత్రి వద్దనే ఉంది. ఇక గడ్డం వినోద్, వివేక్ లలో ఒకరిని మంత్రి పదవి వరించే ఛాన్స్ ఉంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు కూడా గట్టిగా వినబడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News