ఛండీగఢ్: హెడ్ కానిస్టేబుల్ చంపిన కేసులో నలుగురిని అరెస్టు చేసిన సంఘటన పంజాబ్‌లోని బర్నాలాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పరమ్ జీత్ సింగ్ అలియాస్ పమ్మా, గుర్మీత్ సింగ్, వాజిర్ సింగ్ జుగరాజ్ సింగ్ అనే నలుగురు కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. బిల్లు విషయంలో నలుగురు రెస్టారెంట్ యజమానితో గొడవకు దిగారు. యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. హెడ్ కానిస్టేబుల్ దర్శన్ సింగ్ తన సిబ్బందితో కలిసి సదరు రెస్టారెంట్ వద్దకు చేరుకున్నాడు. హెడ్‌కానిస్టేబుల్ దర్శన్ సింగ్‌పై నలుగురు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
వెంటనే పోలీసులు హెడికానిస్టేబుల్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. దనౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో సిగ్నల్ జంప్ చేసి వెళ్తుండగా పోలీసులు ఆపడానికి ప్రయత్నించారు. పోలీసుల పైకి ప్రేమ్‌జీత్ సింగ్ కాల్పులు జరిపారు. పోలీసుల జరిపిన కాల్పుల్లో పరమ్ జీత్ సింగ్ గాయపడ్డాడు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు రతలించారు. పరమ్‌జీత్ కాల్పుల్లో కాలికి గాయకావడంతో చికిత్స చేసిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.