Monday, December 23, 2024

పెళ్లి బృందంతో వెళ్తున్న కారును ఢీకొట్టిన ట్రక్కు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: పెళ్లి బృందంతో వెళ్తున్న కారును ట్రక్కు ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లా నిప్పాణి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెళ్లి బృందం కారులో బెళగావిలో జరిగే వివాహ వేడుకకు వెళ్తున్నారు. కొల్లాపూర నుంచి వెళ్తుండగా నిప్ఫాణి శివారులో కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ దేవగొండపాటిల్ (25), మగదమ్(80), అదగొండ బాబు పాటిల్ (60), చాయా అదగొండపాటిల్(55) మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News