Tuesday, December 24, 2024

లారీని ఢీకొట్టిన కారు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four Members dead in Car collided Lorry

బెంగళూరు: అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బెంగళూరు శివారులోని పూర్వకారా అపార్ట్‌మెంట్ సమీపంలోs కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ ముందున్న మరో లారీని ఢీకొట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదం ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. మృతులలో ఇద్దరు మహిళలు ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి రోడ్డు పై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News