Monday, December 23, 2024

నాగర్ కర్నూలులో కూలిన ఇల్లు: ఒకే కుటుంబంలో నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు: ఇల్లు కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… వనపట్ల గ్రామంలో మట్టిమిద్దే ఇంట్లో భాస్కర్- పద్మ అనే దంపతలులు తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున మట్టి మిద్దే కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు తల్లి పద్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిగా గుర్తించారు. తండ్రికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నారు. మృతుల బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News