- Advertisement -
భువనేశ్వర్: ఒడిశాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబంలోని నలుగురిని వారి బంధువు కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బర్గర్ జిల్లాలో భట్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝికిఝికి గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. భూ వివాదం కారణంగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని తీసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -