Thursday, January 23, 2025

కర్ణాటకలో దారుణం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణ హత్యకు గురైన సంఘటన కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉడిపి జిల్లాలోని కెమ్మన్ను ప్రాంతంలోని నేజర్ గ్రామానికి చెందిన హసీనా తన ముగ్గురు కుమారులతో కలిసి నివసిస్తుంది. హసీనా భర్త ఉద్యోగ రీత్యా గల్ఫ్ లో పని చేస్తున్నాడు.

కాగా ఆదివారం తెల్లవారు జామున గుర్తు తెలియని కొందరు దుండగులు హసీనా,తన ముగ్గురు కుమారులపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ దాడిలో హసీనా అత్త తీవ్రంగా గాయపడింది. గాయపడిన ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News