Tuesday, September 17, 2024

ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల హతం (వీడియో)

- Advertisement -
- Advertisement -

Four militants killed in an encounter near Nagrota toll plaza

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల మోత మోగింది. ఎదురుకాల్పుల్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై జాన్ టోల్ ప్లాజా దగ్గర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్ లో స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీస్‌కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జమ్మూ-శ్రీనగర్ జాతీయరహదారిని మూసివేశారు. నగ్రోటా చెక్ పోస్టు ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జమ్మూలోకి ఉగ్రవాదులు వస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు భద్రతా బలగాలను ముందుగానే హెచ్చరించాయి. దీంతో బాన్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడంతో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు టెర్రరిస్టులపై తూటాల వర్షం కురిపించారు. ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News