Thursday, January 23, 2025

కారు యజమానిని తుపాకీతో కాల్చి….. కారుతో పరార్

- Advertisement -
- Advertisement -

లక్నో: గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చి కారు యజమానిని తుపాకీతో కాల్చి కారు అపహరించిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ వ్యక్తి తన కారులో సొంతూరుకు వెళ్తుండగా సింఘౌటీ గ్రామ సమీపంలో నలుగురు వ్యక్తులు బైక్‌లపై వచ్చి కారుకు అడ్డుపెట్టారు. కారులో ఉన్న వ్యక్తిని తిట్టారు. అనంతరం అతడి పొట్టలో గన్‌తో కాల్చారు. కారు అపహరించుకొని నలుగురు దుండగులు పారిపోయారు. వాహనదారులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి ప్రకాశ్ బన్సాల్ తెలిపాడు. నలుగురు నిందుతులు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నామని, కారు స్వాదీనం చేసుకున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News