Sunday, November 3, 2024

మొబైల్ స్నాచింగ్ ముఠాలు అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Four mobile snatching gangs arrested in Hyderabad
నాలుగు ముఠాలకు చెందిన తొమ్మిది మంది
92 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి అంజనీకుమార్

హైదరాబాద్: మొబైల్ ఫోన్లు స్నాచింగ్ చేస్తున్న నాలుగు ముఠాలను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు ముఠాలకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 92 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల విలువ రూ.12లక్షలు ఉంటుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని హఫీజ్‌బాబానగర్‌కు చెందిన ఎండి మహ్మద్ అలీ, ఎండి ఖాన్, అమీర్‌ఖాన్ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరిపై కంచన్‌బాగ్, దబీర్‌పుర, చాదర్‌ఘాట్, రాయదుర్గం, మైలార్‌దేవ్‌పల్లి, మారేడుపల్లి, మాదాపూర్‌లో కేసులు ఉన్నాయి. వీరి వద్ద నుంచి 26 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన ఎండి మోసిన్ అలియాస్ చిన్న, చాంద్రాయణగుట్టకు చెందిన ఎండి మూసా అలియాస్ గౌస్ కలిసి మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు. వీరిపై చాంద్రాయణగుట్ట, మీర్‌చౌక్, చార్మినార్, సనత్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి.

వీరి వద్ద నుంచి 14 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌నగర్‌కు చెందిన ఎండి అబ్దుల్ హజీ, ఎండి రఫీక్ అలియాస్ టోతు కలిసి మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు. పహాడీషరీఫ్‌కు చెందిన ఎండి మన్‌సూర్ అలియాస్ కలా కవ్వ అలియాస్ దేవా, మహ్మద్ దస్తగిరి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసలుగా మారిన నిందితులు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు. ఆటోను అద్దెకు తీసుకుని సింగిల్ ప్యాసింజర్లను దోచుకుంటున్నారు. నిందితులపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి చక్రవర్తి, ఇన్స్‌స్పెక్టర్లు, రాఘవేంద్ర, కెవి సుబ్బారావు, ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, చంద్రమోహన్, ఎండి తకియుద్దిన్, గోవింగ్ స్వామి, వాసుదేవ్ తదితరులు పట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News