Wednesday, January 22, 2025

సోరెన్ కేసులో మరో నలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై నమోదైన భూకబ్జాతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) తాజాగా మరో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. పిఎంఎల్‌ఎ కింద అరెస్టు చేసిన వారిలో అంటూ టిర్కీ, ప్రియా రంజన్ సహాయ్, బిర్పిన్ సింగ్, ఇర్షాద్ ఉన్నట్లు అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఈ నలుగురి అరెస్టుతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వెంటనే హేమంత్ సోరెన్‌ను ఇడి అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం హోత్వార్‌లోని బిర్సా ముండా జైలులో జుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన రెవెన్యూ శాఖ మాజీ సబ్ ఇన్‌స్పెక్టర్ భాను ప్రతాప్ ప్రసాద్, మొహమ్మద్ సద్దాం హుస్సేన్, అషర్ అలీని కూడా ఇడి గతంలోనే అరెస్టు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News