Sunday, January 19, 2025

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

Four more special trains for passenger congestion

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్టా మరో నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్- టు కలబుర్గి, – కలబుర్గి- టు హైదరాబాద్ సెంట్రల్‌ల మధ్య రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడపనుంది. వీటితోపాటు తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లతో పాటు కాచిగూడ టు-తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

రైలు నంబర్ 07597 కాచిగూడ స్పెషల్
రైలు నంబర్ 07597 కాచిగూడ స్పెషల్ జూన్ 15, 17 తేదీల్లో కాచిగూడలో రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మరో రైలు నంబర్ 07598 తిరుపతి- టు కాచిగూడ స్పెషల్ జూన్ 16, 18 తేదీల్లో తిరుపతిలో ఉదయం 10.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9.55 గంటలకు కాచిగూడ చేరుకుం టుంది. ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసి, ఏసి 2 టైర్, ఏసి 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ ఉన్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా ప్రస్తుతం మరో నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News