Thursday, January 23, 2025

తిరుపతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు

- Advertisement -
- Advertisement -

Four more special trains to Tirupati:SCR

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నేపథ్యంలోనే తిరుపతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. నాందేడ్ -టు తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు అధికారులు తెలిపారు. నాందేడ్ -టు తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెం.07641) ఆగస్టు 1, 8 తేదీల్లో (సోమవారం) రాత్రి 10.45 గం.లకు నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజ రాత్రి 10.10 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే తిరుపతి -టు నాందేడ్ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెం.07642) ఆగస్టు 2, 9 తేదీల్లో (మంగళవారం) రాత్రి 11.50 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.45 గం.లకు నాందేడ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు పూర్ణ, పర్భణి, గంగఖేర్, పర్లి వైద్యనాథ్, లాతూర్ రోడ్డు, ఉదయ్‌గిర్, బాల్కీ, బీదర్, జహీరాబాద్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యెర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసి 2 టైర్, ఏసి 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News