Monday, January 20, 2025

ఇంత ఘోరం చేయడానికి చేతులెలా వచ్చాయో?

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలోని ఉడుపిలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కూతుళ్లను, ముక్కుపచ్చలారని కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఆదివారం జరిగిన ఈ హత్యాకాండకు ఉడుపి పట్టణం ఉలిక్కిపడింది.

ఉడుపిలోని తృప్తినగర్ లో హసీనా (46) నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం ఆటోలో వచ్చిన ఓ దుండగుడు, ఇంట్లోకి చొరబడి హసీనాతోపాటు ఆమె కుమార్తెలు అఫ్నాన్ (23), అయ్ నాజ్ (21) లను కత్తితో పొడిచి చంపాడు. ఇంటి ముందర ఆడుకుంటున్న హసీనా కుమారుడు పన్నెండేళ్ల అసీమ్ ను కూడా హంతకుడు వదిలిపెట్టలేదు. ఇంట్లో ఉన్న హసీనా అత్తగారిపైనా హత్యాయత్నం చేశాడు. ఇది చూసి అరవబోయిన పొరుగింటి బాలికను అరవొద్దంటూ కత్తి చూపి బెదిరించి, పరారయ్యాడు.

హసీనా భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు. మృతులలో ఒకరైన అఫ్నాన్ ఎయిర్ ఇండియా ఉద్యోగి. ఆదివారం సెలవు కావడంతో ఆమె తల్లి వద్దకు వచ్చి, హత్యకు గురయ్యారు. హంతకుడు మాస్క్ వేసుకుని ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హత్యాకాండకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News