Saturday, April 5, 2025

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్ మృతి

- Advertisement -
- Advertisement -

రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులలో నలుగురు నక్సలైట్లు మరణించారు. జంగ్లా పోలీసు స్టేషన పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నక్సల్స్ కోసం వేర్వేరుగా జిల్లా రిజర్వ్ గార్డు(డిఆర్‌జి), సిఆర్‌పిఎఫ్ బృందాలు అడవిలో గాలింపు జరుపుతున్న సందర్భంగా డిఆర్‌జి గస్తీ బృందాలకు ఛోటే తుంగలి అటవీ ప్రాంత సమీపంలో నక్సల్స్ ఎదురుపడ్డారు. దీంతో వెంటనే అప్పమత్తమైన డిఆర్‌జి బృందాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుంచి ఇప్పటి వరకు నక్సల్స్‌కు చెందిన నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నక్సల్స్ కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News