Friday, November 22, 2024

చత్తీస్‌గఢ్ లో నలుగురు నక్సల్స్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడిన నలుగురు నక్సల్స్ చత్తీస్‌గఢ్ కంకేరు జిల్లాలో భద్రతా బలగాల ముందు గురువారం లొంగిపోయారు. వీరందరిపై రూ. 12 లక్షల వరకు సామూహిక నగదు రివార్డు ప్రకటించి ఉంది. వీరిలో ఇద్దరు మహిళలు, ఉన్నారు. మావోయిస్టుల శుష్క సిద్ధాంతాలకు , అమానవీయతకు తాము అసంతృప్తితో ఉన్నామని, రాష్ట్రప్రభుత్వం చేపట్టిన నక్సల్ నిర్మూలన విధానం, సంక్షేమ పథకాలకు ప్రభావితమయ్యామని వారు వెల్లడించారని పోలీస్ అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన నలుగురిలో నక్సల్ నార్త్ బస్తర్ డివిజన్ కు చెందిన కుయెమెరి స్థానిక ఆర్గనైజేష్‌షన్ స్కాడ్ కమాండర్‌గా సీతాయ్ కొర్రం అలియాస్ సూర్జన్న ఉంటోంది.

ఈమె తలపై రూ. 5 లక్షల రివార్డు ఉంది. నక్సల్స్‌లో 2007లో చేరిన సూర్జన్న 2007 నుంచి 2024 వరకు అనేక హింసాత్మక సంఘటనల్లో పాలు పంచుకుంది. 2010లో నారాయణ్‌పూర్ జిల్లాలో 27 మంది భద్రతా సిబ్బందిని హత్య చేసిన సంఘటనలో ఈమె పాత్ర వహించింది. కంకేర్‌లో 2013లో పోలీస్ పెట్రోలింగ్ పార్టీపై దాడి చేసి ఒక కానిస్టేబుల్ ను హత్య చేశారు. లుక్కు పునెం అలియాస్ నరేష్ తలపై కూడా రూ. 5 లక్షల రివార్డు ఉంది. సరిత సొరి అలియాస్ అంజు, గంగా డిర్డో అలియాస్ సాగర్ కూడా క్రియాశీల కార్యకర్తలుగా ఉండేవారు. వీరిద్దరితోపాటు నరేష్ అనేక సంఘటనల్లో పాల్గొనే వాడు. లొంగిపోయిన నలుగురు నక్సల్స్‌కు ప్రభుత్వ పునరావాస పథకం కింద రూ. 25,000 వంతున ఆర్థిక సాయం కల్పిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News