Wednesday, January 1, 2025

ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు నక్సల్స్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ లోని బీజపూర్ జిల్లా పొండుం గ్రామ సమీప అడవుల్లో నలుగురు నక్సల్స్‌ను బుధవారం పోలీస్‌లు పట్టుకున్నారు. పోలీస్ బృందం యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ అయినవారిలో సుక్కు హప్కా అలియాస్ పులాల్ అలియాస్ పటేల్, మన్ను హప్కా, లచ్చు మాద్వి, కోసల్ మాద్వి, అలియస్ గులాబ్ ఉన్నారు. వీరిలో పటేల్ పులాడి రివల్యూషనరీ కమిటీ నేతృత్వం లోని జంతన్ సర్కార్‌కు అధినేతగా ఉంటున్నాడు. కోసల్ సభ్యుడు. మిలిషియా డిప్యూటీ కమాండర్‌గా మన్ను ఉంటున్నాడు. పులాడి ఆర్‌పిసి మిలీషియా సభ్యుడుగా లచ్చు ఉంటున్నాడు. వీరి నుంచి పోలీస్‌లు టిఫిన్ బాంబ్, కార్డెక్స్ వైర్, స్విచ్, ఎక్స్‌కెవేషన్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వీరిని స్థానిక కోర్టు జైలుకు పంపించిందని పోలీస్‌లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News