Friday, November 15, 2024

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే నియమితులయ్యారు. జస్టిస్ అలోక్ అరాధే ప్ర స్తుతం కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నారు. జస్టిస్ పి.సామ్ కోశిని తెలంగా ణ హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఈ నెల 5న పలువురు జడ్జీల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి విదితమే. కొలీజియం సిఫార్సు చేసిన వారిలో ఐడుగురు జడ్జీల బదిలీకి కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సంప్రదింపుల తర్వాత జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాయపూర్‌లో 1964 ఏప్రిల్ 13న జన్మించిన జస్టిస్ అలోక్ 1988 జులై 12న న్యాయవాదిగా చేరారు. 2009 డిసెంబర్ 29న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జమ్ముకశ్మీర్ న్యాయమూర్తిగా 2016 సెప్టెంబర్ 16న బదిలీ అయిన జస్టిస్ అలోక్ అరాధే ఆ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీకి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి చైర్మన్‌గా చేశారు.

జస్టిస్ అలోక్ ఆరాధే 2018లో మూడు నెలల పాటు జమ్ము కశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2018 నవంబర్ 17 నుంచి కొనసాగుతున్న జస్టిస్ అలోక్ కొంతకాలం కర్ణాటక తాత్కాలిక సిజెగా చేశారు. కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణతో పాటు కేరళ, ఒరిస్సా, గుజరాత్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిం ది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News