Saturday, December 21, 2024

కుటుంబంలో నలుగురి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో గురువారం దారుణ హత్యాకాండ జరిగింది. దుండగులు ఓ ఇంటి లోపలికి చొరబడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని తుపాకీతో కాల్చి చంపారు. చనిపోయిన వారిలో ఇంటిపెద్ద టీచర్ 35 సంవత్సరాల సునీల్‌కుమార్, ఆయన భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటన పట్టణంలోని భవానీ నగర్ రౌండ్ అబౌట్ ప్రాంతంలో జరిగింది . దుండగులు ఎందుకీ దారుణానికి పాల్పడిందీ? ఏ విధంగా లోపలికి చొరబడింది? వెంటనే తెలియలేదు. ఘటన గురించి ఆ తరువాత స్థానిక సీనియర్ పోలీసు అధికారి అనూప్ సింగ్ మీడియాకు వివరించారు. కొందరు వ్యక్తులు ఇంటిలోకి రాగానే కుటుంబ పెద్దను , ఆయన భార్యను, ఐదు, రెండేళ్ల ఆడపిల్లలను కాల్చివేశారు.

ఇది దొంగలు చేసిన పనికాదని వెల్లడైంది. అయితే హతుడు అయిన టీచర్ ఎస్‌సి/ ఎస్‌టి యాక్ట్ పరిధిలో ఆగస్టు నెలలో చందన్ వర్మ అనే వ్యక్తిపై కేసు పెట్టినట్లు గుర్తించామని, ఈ కేసుకు, ఇప్పటి ఘటనకు సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. ఘటన గురించి తెలియగానే పోలీసు బృందం అక్కడికి చేరుకుంది. ఇంట్లో నేలపై పడి ఉన్న వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే వారు చనిపోయి ఉన్నట్లుగా నిర్థారించారు. ఘటనా స్థలంలో పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News