Thursday, December 12, 2024

చికిత్స పొందుతూ ఒకే కుటుంబంలోని నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, తాండూర్ మండలం, కాసిపేటలో ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించారు. వివరాల్లోకి వెళ్తే… సముద్రాల శివప్రసాద్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తూ అందులో నష్టాలు రావడంతో అప్పులపాలయ్యాడు. వాటిని తీర్చలేక తన కుటుంబ సభ్యులైన తండ్రి సముద్రాల మొండయ్య, తల్లి శ్రీదేవి, అక్క చైతన్యతో కలిసి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వారి అరుపులను విన్న స్థానికులు గమనించి వారిని వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ వారంతా బుధవారం మరణించారు. శివప్రసాద్ మేనమామ కోలేటి రమేష్ ఫిర్యాదు మేరకు తాండూర్ ఎస్‌ఐ కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను తాండూర్ సిఐ కుమారస్వామి పరిశీలించారు. మృతుల బంధువుల సమక్షంలో సంఘటన పూర్వాపరాలు తెలుసుకొని శవపంచనామా నిర్వహించామని ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News