Monday, December 23, 2024

దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న నలుగురు అనాథలు

- Advertisement -
- Advertisement -

Four orphans waiting for donor help
మన తెలంగాణ/మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని కొండ్రపోల్ గ్రామంలో నివాసం ఉంటున్న నలుగురు అనాథ పిల్లలను గత 2 సంవత్సరాల క్రితం తల్లి, తండ్రి ఇద్దరు వదిలేసి వీరిని అనాథలుగా మార్చిన ఘటన చాలా బాధాకరం. ఈ విషయం తెలుసుకున్న నాయనమ్మ 60 ఏండ్ల వృధాప్యంలో కూడా ఇడ్లీలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో వీరికి ఒక పూట భోజనం పెడుతున్నారు. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబం ఎవరైనా దాతలు సహాయం చేస్తారని ఆశిస్తున్నారు. ఈ నలుగురిలో ఇద్దరు ఆడ పిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పిల్లల బాధ్యత నాయనమ్మపై ఉండటంతో వృధ్దాప్యంలో ఊరు మొత్తం తిరిగి ఇడ్లీలు అమ్మలేనని తన బాధను వ్యక్తం చేసింది. దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని వారు ప్రాదేయపడుతున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 9059176386 నెంబర్‌కు ఫోన్‌పే, లేదా గూగుల్ పే చేయాలని వారు వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News