Wednesday, January 22, 2025

కచ్‌లో నలుగురు పాక్ మత్సకార్మికులు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Four Pakistani fishermen arrested in Kutch

అహ్మదాబాద్ : గుజరాత్ లోని కచ్ సరిహద్దుల్లో నలుగురు పాకిస్థానీ మత్స కార్మికులను బిఎస్‌ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. కచ్ లోని ఇండోపాక్ సరిహద్దు సమీపం లోని హరామి నల్లా వద్ద దేశంలో అక్రమంగా ప్రవేశించిన మత్స కార్మికులను అదుపు లోకి తీసుకున్నారు. భుజ్ ప్రాంతంలో బిఎస్‌ఎఫ్ జవాన్లు పెట్రోలింగ్ చేస్తుండగా భారత భూభాగం లోకి చొరబడుతున్న ఫిషింగ్ బోట్లను గుర్తించారు. వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. పది బోట్లను సీజ్ చేశారు. వాటిలో అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News