Monday, December 23, 2024

ఈ సిగరేట్లు విక్రయిస్తున్ననలుగురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నిషేధిత ఈ సిగరేట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన ఈ సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని మల్లేపల్లికి చెందిన షేక్ అస్లాం, రాహిల్ ఖాన్, రిషీ అగర్వాల్, శ్రేయాష్ అగర్వాల్,ఎండి సోహైబ్ కలిసి ఈ సిగరేట్లు విక్రయిస్తున్నారు. కాలేజీలు, పాఠశాలల వద్ద విద్యార్థులకు సిగరేట్లను విక్రయిస్తున్నారు.

ఈ సిగరేట్లను తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుండడంతో ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ విషయం తెలుసుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నలుగురిని జూబ్లీహిల్స్‌లో పట్టుకుని విచారించారు. నిందితులు ఢిల్లీ నుంచి ఈ సిగరేట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిసింది. కేసు దర్యాప్తులో నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News