Wednesday, January 22, 2025

గాలిలో రెండు హెలికాప్టర్లు ఢీ: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో సోమవారం గాలిలో రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఆస్ట్రేలియా రాజధాని బ్రిస్సెస్‌కు 45 కిమీ దూరంలోని క్వీన్స్‌లాండ్‌లోని పర్యాటక ప్రదేశమైన గోల్డ్‌కోస్ట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఒక హెలికాప్టర్ ల్యాం డింగ్ అవుతుండగా, మరొకటి గాలిలోకి ఎగురుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని క్వీన్‌లాండ్ అధికారులు వెల్లడించారు. సీ వరల్డ్ థీమ్ పార్కు బీచ్‌లో ఓ హెలికాప్టర్ ల్యాండ్ అవుతోన్న క్రమం లోనే మరొకటి టేకాఫ్ అవుతుండగా, రెండు హెలికాప్టర్లు పరస్పరం ఢీకొన్నాయి.

ఒక హెలికాప్టర్ నుజ్జునుజ్జు కాగా, మరొకటి మాత్రం పూర్తిగా దెబ్బతింది. రెండో హెలికాప్టర్ మాత్రం బీచ్‌లో సురక్షితంగా దిగినట్టు క్వీన్స్ లాండ్ పోలీసులు వెల్లడించారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బీచ్‌లోని సీవరల్డ్ డ్రైవ్‌ను మూసివేశారు. వైద్యసిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్టు క్వీన్స్‌లాండ్ అంబులెన్స్ సర్వీస్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News