Thursday, January 23, 2025

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు పిల్లలు గాయపడ్డారు.

ఈ ప్రమాదం చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48పై సోమవారం ఉదయం 7.45 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురు పిల్లలను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Also Read: భవనం కూలి ఇద్దరు మృతి… పది మందికి గాయాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News