Thursday, January 23, 2025

అమెరికాలో భారతీయ సంతతికి చెందిన నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

అమెరికాలో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. కాలిఫోర్నియాకు సమీపంలోని శాన్ మటియోలో తమ ఇంట్లో వారు చనిపోయి ఉండగా ఈనెల 13న పోలీసులు కనుగొన్నారు. మృతులను ఆనంద్ సుజిత్ హెన్రీ (42), అలైస్ ప్రియాంక (40), వాళ్ల కవల పిల్లలు నోవా, నీతన్ (4)లుగా గుర్తించారు.
ఇద్దరి మృతదేహాలపై బులెట్ గాయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా ఇద్దరి మరణానికి కారణం తెలియరాలేదు. ఆనంద్, అలైస్ ఇద్దరూ ఐటి ఉద్యోగులు. తొమ్మిదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఆనంద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గానూ, అలైస్ సీనియర్ అనలిస్ట్ గానూ పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆనంద్ కుటుంబం న్యూ జెర్సీనుంచి శాన్ మటియో కౌంటీకి వచ్చి స్థిరపడింది.
అమెరికాలో ఇటీవల కొందరు ఇండియన్స్ హత్యకు గురైన నేపథ్యంలో తాజాగా ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూయడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News