Sunday, January 19, 2025

శ్రీశైలం రహదారిపై ప్రమాదం

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్  ః నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం రెండు కార్లు ఢీ కొన్నాయి. దోమలపెంట సమీపంలోని ఆక్టోపస్ వ్యూ పాయింట్ దగ్గరలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా రెండు కార్లు ఢీ కొనడంతో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు స్థానికుల ద్వారా తెలిసింది. గాయ పడిన వారిని స్థానికులు సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక వాహనం నెంబర్ టిఎస్ 13 యుబి 8185గా స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News