Monday, December 23, 2024

వెయ్యేళ్ల తరువాత ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు

- Advertisement -
- Advertisement -

Four planets in row after thousand years

ఏప్రిల్ 26,27 తేదీల్లో సాక్షాత్కరించిన అపురూప దృశ్యం
ఏప్రిల్ 30 న అత్యంత చేరువకానున్న శుక్రుడు, బృహస్పతి
భువనేశ్వర్ ప్లానెటోరియం డిప్యూటీ డైరెక్టర్ సువేందు పట్నాయక్ వెల్లడి

న్యూఢిల్లీ : అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు వెయ్యేళ్ల తరువాత ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, తోపాటు శని, గ్రహం ఒకే రేఖపై కనువిందు చేశాయి. ఏప్రిల్ 26,27 తేదీల్లో ఈ అరుదైన గ్రహాల కూర్పు కనిపించింది. తూర్పున సూర్యోదయానికి ముందు ఈ గ్రహాలు ఒకే రేఖపైన దర్శనమిచ్చినట్టు భువనేశ్వర్ లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ సువేందు పట్నాయక్ వెల్లడించారు. సౌర వ్యవస్థలో ఒకే ప్రాంతంలో ఒకే వరుసలోకి గ్రహాలు వచ్చే క్రమాన్ని ప్లానెట్ పరేడ్ అని పేర్కొంటారని పట్నాయక్ తెలిపారు. పట్నాయక్ వివరాల ప్రకారం అంతరిక్షంలో సాధారణంగా మూడు ప్లానెట్ పరేడ్‌లు కనిపిస్తాయి. అందులో మొదటిది … సూర్యుడికి ఒకవైపునకు గ్రహాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. మూడు గ్రహాలు సూర్యుడికి ఒకవైపునకు కనిపించటం సర్వసాధారణం. ఒక ఏడాదిలో ఇలా చాలాసార్లు దర్శనమిస్తాయి. ఏడాదిలో ఒకసారి నాలుగు గ్రహాలు ఒకే వరుస లోకి వస్తాయి. ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి ఐదు గ్రహాలు ఇలా ఒక వరుసలోకి వస్తాయి.

8 గ్రహాలు సైతం ఇలా ఒకే వరుస లోకి వస్తాయని, కానీ అందుకు 170 ఏళ్లు పడుతుందని పట్నాయక్ పేర్కొన్నారు. ఇక రెండో విషయం. గ్రహాలు అవి కనిపించే పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకే సమయంలో ఆకాశంలో ఒక చిన్న ప్రాంతంలో కనిపిస్తాయి. దాన్ని కూడా ప్లానెట్ పరేడ్‌గా పిలుస్తారు. ఇదివరకు 2002 ఏప్రిల్ 18 న, 2020 జులైలో ఇలాంటి ప్లానెట్ పరేడ్ కనిపించింది. మూడోది …. కొన్ని గ్రహాలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్న అరుదైన సందర్భాల్లో ఈ మూడో రకం ప్లానెట్ పరేడ్ ఏర్పడుతుంది. మూడు గ్రహాలు ఒకే వరుస లోకి రావటం ఒక ఏడాదిలో చాలా సందర్భాల్లో కనిపిస్తుందని పట్నాయక్ వివరించారు. 2022 ఏప్రిల్ 26,27 తేదీల్లో సూర్యోదయానికి ఒక గంట ముందు , చంద్రుడితోపాటు నాలుగు గ్రహాలు తూర్పు అక్షాంశానికి 30 డిగ్రీల కోణంలో ఒకే వరసలో కనిపించాయి. గతంలో సుమారు వెయ్యేళ్ల క్రితం క్రీ.శ. 947 లో ఇలా జరిగింది. పరిస్థితులు అనుకూలించి శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి , శని, గ్రహాలు ఒకే వరుస లోకి వస్తే, టెలిస్కోప్ అవసరం లేకుండానే నేరుగా వాటిని చూడవచ్చు. ఏప్రిల్ 30 న శుక్రుడు, బృహస్పతి, అత్యంత దగ్గరగా రానున్నాయి. బృహస్పతికి దక్షిణం వైపు 0.2 డిగ్రీల కోణంలో శుక్రుడు కనిపించనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News