Monday, December 23, 2024

రోహిత్ రెడ్డికి ఫోర్ ప్లస్ ఫోర్ భద్రత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారం సందర్భంగా తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంచారు. రోహిత్ కు ఫోర్ ప్లస్ ఫోర్ గన్‌మెన్లను కేటాయిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ 2+2 గన్‌మెన్లు కలిగి ఉన్న రోహిత్ రెడ్డి పైలెట్‌ కు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం తీసుకుంది.

 ఎంఎల్‌ఎల భేరసారాలపై రోహిత్ రెడ్డి, రామచంద్ర భారతి స్వామీజీ మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగాయి. ఎవరెవరికి ఎంత ఇవ్వాలనే దానిపై రోహిత్ రెడ్డి, ఇద్దరు స్వామీజీలు, నంద కూమార్‌ల మధ్య మంతనాలు జరిగాయి. మునుగోడు ఉప ఎన్నికకు ముందే పార్టీ మారితే రూ.100 కోట్లు రోహిత్ రెడ్డికి ఇస్తామని స్వామీజీ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News