న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో 30 ఏళ్ల మహిళపై అఘాయిత్యం జరిగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోని ఒక గదిలో ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఆరోపణపై నలుగురు రైల్వే ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. తనపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారంటూ బాధితురాలి నుంచి శుక్రవారం తమకు ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 89 ప్లాట్‌ఫాంలో ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ కోసం ఉద్దేశించిన ట్రైన్ లైటింగ్ హట్‌లో ఈ అత్యాచార ఘటన జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ( రైల్వేస్ ) హరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ బాధితురాలు ఫరిదాబాద్ నివాసి అని చెప్పారు. బాధితురాలి కథనం ప్రకారం నిందితుల్లో ఒకరిని రెండేళ్ల క్రితం ఒక ఉమ్మడి స్నేహితుని ద్వారా ఆమె కలుసుకుంది. తాను రైల్వే ఉద్యోగినని, ఆమెకు కూడా ఉద్యోగం ఇప్పిస్తానని అతను ఆశ చూపించాడు. గురువారం నాడు ఆ వ్యక్తి తన కుమారుడి పుట్టిన రోజు అంటూ ఫోన్ చేశాడు. దాంతో ఆమె కీర్తి నగర్ మెట్రో స్టేషన్ చేరుకుంది. ఆమెను రిసీవ్ చేసుకున్న అతను రైల్వే స్టేషన్ లోని హట్ లోకి తీసుకెళ్లాడు. ఆ రూము లోనే తన పై అత్యాచారం జరిగిందని, ఇద్దరు నిందితులు గది బయట కాపలాగా ఉన్నారని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు డీసీపీ తెలిపారు.
యువతిపై అత్యాచారం… నలుగురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -