Saturday, December 21, 2024

హైదరాబాద్‌లో గంటల వ్యవధిలో నాలుగు రోడ్డు ప్రమాదాలు: ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలోని ఆదివారం నాడు ఉదయం గంటల వ్యవధిలో నాలుగు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరాంఘర్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కుషాయిగూడ ఇసిఐఎల్ క్రాస్ రోడ్ వద్ద ఉదయం ఓ బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో మౌలాలికి చెందిన క్రాంతి (33), జనగాం జిల్లాకు చెందిన నరేశ్ (23) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్రాంతి, నరేశ్ లు ఇద్దరూ మౌలాలి నుంచి పల్సర్ బైక్ పై వస్తుండగా ఇసిఐఎల్ చౌరస్తా వద్ద బైక్ అదుపు తప్పి ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదాలకు అతి వేగంతో పాటు మద్యం మత్తులో వాహనాలు నడపడం కూడ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదాలపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి.

ఈ ప్రమాదాలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భాగ్యనగరంలో రోజురోజుకూ ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. ముఖ్యంగా కొందరు ఆకతాయిలు బైకులు, కార్లపై విన్యాసాలు చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. మరికొం దరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారి ఆట కట్టించడానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోతోంది. రాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వారికి, సీటు బెల్ట్ ధరించని వారికి ఫైన్‌లు విధించి, వారిపై చర్యలు తీసుకుంటున్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాల దృష్ట్యా పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చినా ప్రమాదాలకు అడ్డుకట్ట మాత్రం వేయలేకపోతున్నారు.
హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ ..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న మహిళలను ఢీకొట్టిన బైకర్, ఇద్దరూ స్పాట్‌లోనే
పోలీసులు ఎంతగా నిఘా పెడుతున్నా.. భారీగా జరిమానాలు విధిస్తున్నా హైదరాబాద్‌లో మాత్రం హిట్ అండ్ రన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బండ్లగూడలో మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న తల్లీకూతుళ్లను కారు ఢీకొట్టడంతో వారు స్పాట్‌లోనే దుర్మరణం చెందారు. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి అదే తరహా ఘటన చోటు చేసుకుంది. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఇద్దరు మహిళలను బైక్ ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే బొల్లారంలో ఈ ఘటన సంభవించింది. రీసాలా బజార్‌కు చెందిన రాధిక (48) కలాసిగూడ సాయికాలనీకి చెందిన బాలమని యాదవ్ అనే మహిళలు మంచి స్నేహితులు. గడిచిన కొన్నేళ్లుగా వీరు కలిసిమెలిసి జీవిస్తున్నారు. స్లానిక కంటోన్మెంట్ బోర్డు పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో పార్క్ వద్దకు బయల్దేరారు. ఈ క్రమంలో ఉప్పల్‌కు చెందిన ఆదిత్య ఓ స్పోర్ట్ బైక్‌తో అత్యంత వేగంగా వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాధిక స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా బాలమని యాదవ్‌ను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం తరలిస్తుండగా ఆమె తుదిశ్వాస విడిచారు. సమా చారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ట్యాంక్‌బండ్‌పై కారు బీభత్సం…
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లింది. ట్యాంక్ బండ్ వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన డ్రిల్స్, చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది. కారులోని బెలూన్స్ బయటకు రావడంతో.. ఎవరికీ గాయాలు కాకుండా పెను ప్రమాదం తప్పింది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారును వదలి పరారయ్యారు. నిందితులు గుంటూరుకు చెందిన షేక్ కరీం, మాదాపూర్ నివాసిగా సైఫాబాద్ పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కాగా, కారును అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News