Wednesday, January 22, 2025

క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్‌ఎల్‌ఎలకు భద్రత

- Advertisement -
- Advertisement -

ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసేందుకు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు సమాజ్‌వాది (ఎస్‌పి ) ఎమ్‌ఎల్‌ఎలకు వై కేటగిరి భద్రత కల్పించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అభయ్‌సింగ్ (గొసైగంజ్) మనోజ్‌కుమార్ పాండే ( ఉంచహార్) , రాకేష్ ప్రతాప్ సింగ్ ( గౌరీగంజ్ ) వినోద్ చతుర్వేది ( కల్పి) అనే ఈ నలుగురు ఎమ్‌ఎల్‌ఎలకు వై కేటగిరి భద్రత కల్పించారు. ఈ కేటగిరి భద్రతలో భాగంగా ఎనిమిది మంది సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఈ ఎమ్‌ఎల్‌ఎలకు రక్షణగా ఉంటారు. వీరిలో ఐదుగురు ఆ ఎమ్‌ఎల్‌ఎల ఇళ్లకు , మిగతా వారు ఆ ఎమ్‌ఎల్‌ఎలతో కలిసి ప్రయాణిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News